Home  »  TV News  »  రిషికి సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన స్టూడెంట్స్!

Updated : May 2, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -751 లో.. ధరణి బయట పడుకోవడానికి దిండు దుప్పట్లు తీసుకుపోతుంటే.. జగతి, వసుధారలు చూస్తారు. వసుధార ధరణిని ఏంటని అడగబోతుంటే..  ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదని‌ జగతి తనని ఆపుతుంది. మరుసటి రోజు ఉదయం రిషి కాలేజీకి బయల్దేరుతుంటాడు. ఏ సూట్ వేసుకోవాలోనని రిషి కన్ఫ్యూజన్ లో ఉంటాడు. రిషికి వసుధార సూట్ సెలక్ట్ చేస్తుంది. ఆ తర్వాత మన ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి వసుధార అని రిషి అంటాడు. మీపై నాకు ఎప్పుడు ప్రేమనే ఉంటుందని వసుధార అంటుంది.

ఆ తర్వాత కాలేజీకి ఇద్దరు బయలుదేరుతుంటే.. వాళ్ళు అన్యోన్యంగా ఉండటం చూడలేని దేవయాని.. వాళ్ళు అలా హ్యాపీగా ఉంటే నాకు నచ్చడం లేదని శైలేంద్రతో అంటుంది. మన అయిష్టాలు అసహనాలు ఇలా చెప్పకూడదని శైలేంద్ర అంటాడు. రిషి, వసుధారలతో పాటు శైలేంద్ర కూడా కాలేజీకి బయల్దేరుతాడు. కార్ దగ్గరికి వెళ్ళగానే.. అన్నయ్య మీరు ముందు కూర్చోండని రిషి అనగానే.. లేదు రిషి.. వసుధార నువ్వు పక్కపక్కన కూర్చోండి.. మిమ్మల్ని నేను విడదియ్యలేనని శైలేంద్ర అంటాడు. ఇక కాలేజీకి వెళ్తుంటే.. రిషి మాత్రం శైలేంద్ర గురించి గొప్పగా చెపుతాడు. కాలేజీకి వెళ్ళగానే కొందరు స్టూడెంట్స్ బొకేతో రిషి దగ్గరికి వస్తారు. ఏంటి స్పెషల్ అని రిషి అడుగగానే.. సర్ ప్రైజ్ అని స్టూడెంట్స్ అంటారు. కాలేజీలో రిషికి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి శైలేంద్ర కుళ్ళుకుంటాడు. రిషి, శైలేంద్రలు అలా కలిసిరావడం చూసిన ఫణింద్ర, మహేంద్ర లు సంతోషపడుతారు. జగతి మాత్రం.. దేవయాని అక్కలాగా శైలేంద్ర ఉన్నాడు.. మీలా మంచివారు కాదని మనసులో అనుకుంటుంది. రిషి కాలేజీలో శైలేంద్రని పరిచయం చేస్తాడు. స్టూడెంట్స్ మాత్రం ఎవరయినా మాకు అవసరం లేదు.. మీరే మాకు ఇంపార్టెంట్ అన్నట్లు స్టూడెంట్స్ మాటలు ఉండడంతో.. శైలేంద్ర కోపంతో రగిలిపోతాడు. ఇక కాలేజీకి సంబంధించిన లోగోని స్టూడెంట్స్ తయారు చేస్తారు.. అది రిషికి చూపిస్తారు. వసుధార, జగతిల సహాయం తో చేశామని స్టూడెంట్స్ చెప్పగానే.. రిషి ఆశ్చర్యపోతాడు. ఈ లోగోని మీరే ఆవిష్కరించండని స్టూడెంట్స్ అనగానే.. శైలేంద్ర తన మనసులో.. ఇంకెవరు నన్నే ఆవిష్కరించారమంటారని అనుకుంటాడు. కానీ రిషి మాత్రం ఈ లోగో ఆవిష్కరణ జగతి, వసుధారలు చెయ్యాలని అంటాడు.

ఆ తర్వాత శైలేంద్ర తన మనసులో కన్నింగ్ గా ఆలోచిస్తుంటాడు. ఎలాగైనా కాలేజీ ఎండీ స్థానంలో శైలేంద్ర కూర్చోవాలని చూస్తుంటాడు. మరి దేవయాని కుట్ర ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.